ఘ‌నంగా విజ‌య‌ద‌శ‌మి వేడుక‌లు

తాండూరు మండ‌లం మాదారం టౌన్ షిప్‌లో విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలు ఆనందోత్సవాల నడుమ దసరా వేడుకలు చేసుకున్నారు. కోదండ రామాల‌యంలో ప్ర‌తిష్టించిన అమ్మ‌వారికి తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు శమీ పూజ, ఆయుధ పూజ, వాహనాలకు పూజలు చేశారు. ఒకరికొకరు జమ్మీ ఆకు ఇచ్చిపుచ్చుకుంటూ ఆత్మీయ ఆలింగానాలు చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. జ‌మ్మి చెట్టుకు సింగ‌రేణి బెల్లంప‌ల్లి ఏరియా జీఎం శ్రీ‌ర‌మేష్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో ఏరియా సెక్యూరిటీ ఆఫీస‌ర్ శ్రీ‌ధ‌ర్‌, డీసీసీ ఉపాధ్య‌క్షుడు సూరం ర‌వీంద‌ర్‌, సర్పంచ్ కుశ్న‌ప‌ల్లి ల‌క్ష్మ‌ణ్‌, ఉప‌స‌ర్పంచ్  దామోద‌ర్‌, ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్య‌క్షుడు పేరం శ్రీ‌నివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

You might also like