చెప్పు దెబ్బలు తప్పవు

ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం

హైద‌రాబాద్ : తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ తన పద్దతి మార్చుకోవాలని, లేదంటే చెప్పు దెబ్బలు తప్పవని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పిల్లల్ని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. దీని వెనుక బీజేపీ. బండి సంజయ్ కుట్ర ఉందని, ఇదే బీజేపీ సంస్కృతి అని విమర్శించారు. హెచ్చరించారు. బీజేపీ పార్టీ ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి తమ పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. త‌మ స‌హ‌నానికి, సంయ‌మ‌నానికి ఒక హ‌ద్దు ఉంటుంద‌న్న విష‌యం గుర్తుంచుకోవాల‌న్నారు.

తాను వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని…. బీజేపీకి చీము నెత్తురు ఉంటే తాను ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో స‌మ‌ర్పించిన దానికంటే ఎక్కువ ఉన్న‌ట్లు చూపిస్తే బండి సంజ‌య్‌కు రాసిస్తాన‌న్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేశామ‌న్నారు. రాష్ట్ర డీజీపీ స్పందించాలని కోరారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ ఏం చేస్తోందని ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 8 లక్షల 72వేల ఉద్యోగాలు ఇవ్వకుండా మోదీ గడ్డిపీకుతున్నారా…? అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయరో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని నిల‌దీశారు. దమ్ముంటే బండి సంజ‌య్‌, అరవింద్, కిషన్ రెడ్డి బొగ్గు బ్లాకుల వేలం ఆపించాల‌ని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like