ఆదిలాబాద్ లో కొన‌సాగుతున్న బంద్

ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొన‌సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు తుడుందెబ్బ పిలుపునిచ్చింది. ఉద్యోగుల బ‌దిలీల‌కు సంబంధించి ఇచ్చిన 317 జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. ఉద‌యం నుంచే ఆదిలాబాద్ బస్టాండ్ ముందు ఆదివాసి హక్కుల పోరాట సమితి ధర్నా చేప‌ట్టింది. దీంతో బ‌స్సులు నిలిచిపోయాయి. 317 జీవో ర‌ద్దు చేయాల‌ని, ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ నంబర్ 3 ప్రకారం నియమితులైన ఉద్యోగులనే కేటాయించాలని ఆదివాసీ సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండ‌లాల్లో వ్యాపార‌స్తులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like