అంత‌ర్గ‌త ప్రైవేటీక‌ర‌ణ అడ్డుకుందాం

మీకు అండ‌గా మేం ఉంటాం - కార్మికుల ఉద్యోగ భ‌ద్ర‌త‌కు పెనుముప్పు - కార్మికుల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్న బీఎంఎస్ నేత‌లు

సింగరేణిలోని అన్ని ఏరియాల్లో కార్మికులు తక్కువగా ఉన్నారని సాకు చెబుతూ యాజ‌మాన్యం, రాష్ట్ర ప్ర‌భుత్వం అంత‌ర్గ‌త ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని భార‌తీయ మజ్దూర్ సంఘ్ భూపాల‌ప‌ల్లి ఏరియా ఉపాధ్య‌క్షుడు అప్ప‌ని శ్రీ‌నివాస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేటీకే5 ఇంక్లైన్లో బీఎంఎస్ నేత‌లు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సింగరేణిలో కావాలనే కార్మికుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. త‌క్కువ మంది కార్మికుల‌తో ప‌నులు చేయిస్తున్నారని అన్నారు. వారిని వేధిస్తున్నార‌ని అన్నారు. సీముల వారిగా డిస్టిక్కుల వారీగా బొగ్గు ల‌క్ష్యాలు ఇస్తున్నార‌ని ఆరోపించారు. అధికారులు యాజమాన్య ఆదేశాలను అమలుచేస్తూ కార్మికుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని అన్నారు. సింగరేణిలో అంతర్గత ప్రైవేటీక‌ర‌ణ వ‌ల్ల పర్మినెంట్ కార్మికుల ఉద్యోగ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింద‌న్నారు. సింగరేణిలో కొత్త ఉద్యోగాలు రాకుండా ఉన్న ఉద్యోగాలకు ఉద్వాసన పలికే కుట్రలను తిప్పి కొట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. దీనికి వ్య‌తిరేకంగా చేసే పోరాటాల‌కు బీఎంఎస్‌ వెంట కలిసి రావాల్సిందిగా కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఎంఎస్ ఏరియా కార్య‌ద‌ర్శి రేణికుంట్ల మల్లేష్‌, పని రమేష్. రఘుపతి రెడ్డి. తాండ్ర మొగిలి. సమ్మయ్య. ఉపేందర్.రాజయ్య పాల్గొన్నారు…

ఈ సంద‌ర్భంగా కార్మికులు ప‌లు స‌మ‌స్య‌ల‌పై బీఎంఎస్ నేత‌ల దృష్టికి తీసుకువెళ్లారు.

1. ఎస్‌డీఎల్ మెషిన్స్ సర్వేడ్ ఆఫ్ అయిన బండ్లు నడుస్తున్నాయి.

2 ఎస్‌డీఎల్ కు రిపేర్లు అయిన వాటికి స్పేర్ పార్ట్స్ రావడం లేదు… ఇబ్బందులు పడుతున్నాం. ఎస్‌డీఎల్ మిషిన్స్ బ్రేక్ డౌన్ తో ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ప్రొడక్షన్ కు అంతరాయం క‌లుగుతోంది.

3. ఫిట్టర్, ఎలక్ట్రికల్ మెస్త్రీలకు హెల్పర్స్ ఇవ్వకుండా జూరీ డిక్షన్ లేకుండా రెండు గనుల్లో పని చెబుతున్నారు. అధికారుల వేధింపులు త‌ప్ప‌డం లేదు.

4. గనుల్లో బ్రేక్ డౌన్ వచ్చిన కూడా హెల్పర్ లేకుండా పని చెబుతూ వేధిస్తున్నారు.

5. కేటీకే 5 లో నీటి నిల్వ చేసే సామర్ధ్య గల సంపులు సమర్ధవంతంగా లేవు…అందులో త‌క్కువ నీటి నిలువ ఇబ్బందులు.

6.గనిలో 240 హెచ్‌పీ పంపులు ఎప్పుడు బ్రేకుడౌన్ కావడం..నిత్య ఆందోళన మధ్య పుంపు డ్రైవర్ విధులు.

7. పంప్ డ్రైవర్స్ నిత్యం రన్నింగ్ చార్జీ తో అదనపు గంటలు విధులు నిర్వహిస్తూ ఇబ్బంది పడుతున్నారు… పంపులు అన్ని సర్వే డాఫ్ అయిన‌య్‌. ఎప్పటికి మ‌ర‌మ‌త్తుల‌తో సామర్థ్యం లేని పంపులను నడిపిస్తు ఇబ్బంది పడుతున్నాం.

8. కార్మికుల కొర‌త‌తో అన్ని చోట్ల ఇబ్బందులు ప‌డుతున్నాం.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like