బాసర ఆలయంలో పాముల కలకలం
నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం పాములు కలకలం సృష్టించాయి.నిత్యం భక్తులతో కిటకిటలాడిన ఆలయం ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు రెండు పాములు దర్శనమివ్వడంతో భక్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఏకంగా ఆలయ ప్రవేశం నుండి బయట వెళ్లే ప్రధాన ద్వారం వద్ద రెండు పాములు అటు ఇటు తిరుగుతూ భక్తులకు కనిపించాయి.దీంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పాములను చూసి కొద్దిసేపు భయబ్రాంతులకు గురయ్యారు.చివరకు ఆలయ సిబ్బంది అప్రమత్తంగా వవహరించడంతో ఒక పాము చనిపోగా మరొక పామును అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఆలయ ప్రాంగణం చుట్టూ పచ్చదనంతో చెట్లు ఉండడంతో ఎక్కువ ఇక్కడ తిరుగుతాయని గతంలో కూడా ఇదే తరహాలో కొండచిలువ అక్షరాభ్యాసం మండపంలో చేరుకోవడంతో సిబ్బంది అప్రమత్తమై అటవీ ప్రాంతంలోకి వదిలేసినట్లు అధికారులు తెలిపారు.