మంత్రి కాళ్లు మొక్కిన జాయింట్ కలెక్టర్
అధికారులు రాజకీయ నేతల కాళ్లు మొక్కడం ఇప్పుడు సర్వ సాధారణంగా మారింది. కేసీఆర్ కాళ్లు మొక్కినప్పుడు కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై ఎన్నో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు కూడా అలాంటి సీన్ రిపిటీ్ అయ్యింది విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లమీద పడ్డారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే సమయంలో ఈ ఘటన జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణకు శుభాకాంక్షలు చెబుతూ జేసీ కిషోర్ కుమార్ ఆయన కాళ్ల మీద పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వెల్లువెత్తుతున్న విమర్శలు….
జాయింట్ కలెక్టర్ హోదాలో కిషోర్ కుమార్ బొత్స సత్యనారాయణకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చారు. బొకే ఇచ్చిన అనంతరం బొత్స సత్యనారాయణ కాళ్లకు నమస్కారం పెట్టారు. ఉన్నతాధికారులు ఒక మంత్రి కాళ్లు మొక్కడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.