ఆ మానవ మృగాన్ని అరెస్టు చేయండి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వ రరావు కొడుకు రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. బాధితుడు రామకృష్ణ భార్యను తన వద్దకు పంపాలని ఎమ్మెల్యేకొడుకు ఆదేశించాడని పేర్కొన్నారు. దీంతో అవమానం. భరించలేక రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న దని వివరించారు. రామకృష్ణ యొక్క చివరి సెల్ఫీ వీడియో కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకటేశ్వర్రావు కొడుకు రాఘవేంద్ర దౌర్జన్యాలను వెల్లడిస్తుందని పేర్కొన్నారు.
కేసీఆర్‌కు తెలియదా..!
ఎమ్మెల్యే వనమాను సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘రాఘవ కీచక చేష్టలను తట్టుకోలేకే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు కారకుడైన వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలి. మానవ మృగానికి టీఆర్ఎస్ వత్తాసుగా నిలవడం దుర్మార్గం. ఎమ్మెల్యే కుమారుడు ఇన్ని అరాచకాలు చేస్తుంటే సీఎం కేసీఆర్‌కు తెలియదా?. తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది…?. ఇంటెలిజెన్స్ మొత్తం ప్రతిపక్షాల ప్రజాపోరాటలపై నిఘాకే పరిమితమైందా..? వనమా రాఘవ మాఫియాను మించిపోయారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి. ఘటన జరిగి 3 రోజులైనా చర్చలెందుకు తీసుకోలేదు’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.