పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి
మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ఆర్.పి రోడ్ లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు చేశారు. 73,070/- నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా కేంద్రం ఆర్.పి రోడ్లో టాస్క్ ఫోర్స్ సీఐ ఏకే మహేందర్, ఎస్ఐ లచ్చన్న సిబ్బంది కలసి పేకాట స్థావరం పై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో గోపాల్, ఆర్.యోగేష్, ఐ.రాకేష్ , జాజు రామ్, ఆర్.గోపాల్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమతులు లేని అక్రమ వ్యాపారాలు,కోళ్ల పందాలు, నకిలీ విత్తనాలు,గంజాయి,గుట్కా,మట్కా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిత్యం నిఘా ఉంచుతామని టాస్క్ ఫోర్స్ సిఐ ఏకే. మహేందర్ వెల్లడించారు. దాడిలో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ సీఐ. ఏకే.మహేందర్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న, మంచిర్యాల ఎస్ ఐ కిరణ్,టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్ లను సీపీ అభినందించారు.