పిల్లల భవిష్యత్ కోసం పోరాటం

మంచిర్యాల : ప్రభుత్వం కరోన నిబంధనల పేరుతో సెలవులు పొడగించడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రస్మా ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టారు. పాఠశాలల సెలవులను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పోస్టు కార్డుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు రైతు బంధు సంబరాలు జరిపినప్పుడు రాని కరోనా పాఠశాలలు నడిస్తే వస్తాయా అని ప్రశ్నించారు. బార్లు , రెస్టారెంట్ ల దగ్గర రాని కరోనా పాఠశాలల వద్ద వస్తుందా..? అన్నారు. విద్య అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. 14 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ చేసిన ప్రభుత్వం మళ్లీ వారికి కరోనా సోకుతుందని బడులు మూసివేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు తెరవాలని కోరారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా పిల్లలు సెల్ఫోన్లకు బానిసలై చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్లాస్ లు నడక విద్యార్థులు ఫెయిలై ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోస్టుకార్డులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు పోస్టు చేశారు.