భార్యను కొట్టి చంపిన భర్త
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా తీగల్‌పహాడ్ లోని అల్లూరి సీతారామారాజు నగర్‌లో కుటుంబ కలహాలతో అలేఖ్య (28) అనే మహిళ మృతి చెందింది. ఆదివారం రాత్రి భర్త పగడాల విజయ్‌కుమార్‌కు అలేఖ్యకు గొడవ అయ్యింది. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో అలేఖ్యను భర్త కొట్టి చంపాడు. విజయ్‌కుమార్ ఇద్దరు పిల్లలను తీసుకుని పోలీస్‌స్టేషన్ లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.