ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి యత్నం
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నేతలు క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి పోలీస్స్టేషన్ తరలించారు. క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరిన యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పోచంపల్లి హరీష్ , ఇతర కార్యకర్తలను పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్బంగా పలువురు యువజన కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.