మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్న బీజేవైఎం నేతలు

మంచిర్యాల : జిల్లా కేంద్రంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాన్వాయ్ని బీజేవైఎం నేతలు అడ్డుకున్నారు. మెడికల్ కాలేజీ పనులను పరిశీలించడానికి మంత్రి వెళ్తుండగా బీజేవైఎం నేతలు అడ్డగించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిరుద్యోగుల ఆగ్రహానికి కేసీఆర్ బలికాక తప్పదని హెచ్చరించారు. పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బీజేవైఎం నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేశారు.