కార్మిక వ్యతిరేక చర్యలపై కన్నెర్ర
మంచిర్యాల : కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికులతో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర లోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను నరేంద్రమోడీ దోస్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. యావత్ సింగరేణిని మొత్తం ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తోందన్నారు. రాష్ట్రానికి చెందిన 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేసి సంస్థ మనుగడను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో పిట్ సెక్రెటరీ చిలుముల రాయమల్లు, ఏరియా జిఎం చర్చల ప్రతినిధి వెంగల కుమారుస్వామి, నాయకులు అడ్డు శ్రీను, పొగాకు రమేష్, అన్వేష్ రెడ్డి, సంతోష్,మనిదర్,మాధవ రెడ్డి రెడ్డి,తిరుపతి,ఆశాలు,సదానందం,మల్లయ్య,సిరికొండ రాజయ్య,సందీప్, శ్రీకాంత్, బన్నా వెంకటి,నర్స శ్రీను,రవి ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు..