డిజిటల్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌

ఇక నుంచి డిజిటల్ న్యూస్ జర్నలిస్టులకు గుర్తింపు లభించనుంది. ఇకపై వారు అక్రిడిటేషన్ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మీడియా అక్రిడిటేషన్ మార్గదర్శకాలు-2022ను విడుదల చేసింది. మొదటిసారిగా డిజిటల్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులను అక్రిడిటేషన్‌కు అర్హులుగా ప్రకటించింది. వెబ్‌సైట్ కనీసం ఒక సంవత్సరం పాటు నిరంతరంగా పనిచేసి ఉండాలి. వెబ్‌సైట్‌కి దేశంలో రిజిస్టర్డ్ కార్యాలయం ఉండాలి. కరస్పాండెంట్‌లు ఢిల్లీ లేదా జాతీయ రాజధాని ప్రాంతంలో ఉండాలి. విదేశీ వార్తా మీడియా సంస్థల కోసం పనిచేస్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు ఎలాంటి అక్రిడిటేషన్ మంజూరు చేయరు. ఈ మేరకు ఒక జర్నలిస్టు దేశ భద్రత, సార్వభౌమత్వం, సమగ్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే అక్రిడిటేషన్ రద్దు చేస్తారు. పైగా దానిని తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం జర్నలిస్టుపై తీవ్రమైన నేరం మోపబడితే అక్రిడిటేషన్ సస్పెండ్ చేస్తారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like