కోడి పుంజుకు టిక్కెట్ కొట్టిన కండక్టర్

పెద్దపల్లి : గోదావరిఖని బస్టాండు నుండి కరీంనగర్ కు బస్సులో వెలుతున్న మహ్మద్అలీ అనే ప్రయాణికుడు తన వెంట ఒక కోడిపుంజును తీసుకువచ్చాడు. అది గమణించిన బస్సు కండక్టర్ కోడిపుంజుకు కూడ టికెట్టు కొట్టాడు. దీంతో ఆశ్చర్యానికి గురయ్యాడు ఆ ప్రయాణికుడు. దీనిపై కండక్టర్ ను వివరణ కోరగా ప్రయాణికుడితో పాటు ఒక ప్రాణం తో ఉన్న జీవిని వెంట తీసుకొని వస్తే టిక్కెట్ తీసుకోవాలని బస్ కండక్టర్ తిరుపతి వివరణ ఇచ్చాడు..