చెన్నూరులో పేకాటరాయుళ్ల అరెస్టు
మంచిర్యాల : చెన్నూరులో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రూ. 40,970, ఎనిమిది మొబైల్ ఫోన్లు, 3 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధి పొక్కుర్ శివారులోని అటవీ ప్రాంతంలో, కొంత మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, చెన్నూర్ పోలీసులు కలసి పేకాట స్థావరం పై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఏలేశ్వరం సమ్మయ్య (నాగపురం) కమ్మరి లక్ష్మణ్( వెంకంపేట), బొబ్బిలి ఎల్లయ్య(బీరెల్లి),రాళ్లబండి బాపు(ముత్తరావు పల్లె), బూదే తిరుపతి(నాగాపురం),దుర్గంధర్మారావు(బీరెల్లి)ను అరెస్టు చేశారు.పేకాట నిర్వాహకుడు అనపర్తి ప్రభాకర్ తో పాటు మరో ఇద్దరి వ్యక్తులు పరారీ లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సీఐ. ఏకే.మహేందర్, సిబ్బంది రాకేష్,సంపత్ కుమార్,భాస్కర్ గౌడ్,శ్యాం సుందర్,శ్రీనివాస్ ను సీపీ అభినందించారు.