అరో కంపెనీకి కోయగూడెం బ్లాక్
ఆవిరైన సింగరేణి సంస్థ ఆశలు
సింగరేణిలో ప్రైవేటీకరణ చేయనున్న నాలుగు బొగ్గు బ్లాక్‌లో కోయగూడెం బొగ్గ బ్లాక్‌ను అరో కంపెనీ దక్కించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని కోయగూడెం బ్లాక్-3కి అరో కోల్ ప్రైవేటు లిమి టెడ్ కంపెనీ ఆసక్తి చూపింది. దానికి సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపింది. సింగరేణి సంస్థకు చెందిన సత్తుపల్లి బ్లాకు-3, కోయగూడెం బ్లాకు-3, శ్రావణ్ పల్లి బ్లాక్-3, కళ్యాణిఖని -6 గనులను కేంద్ర ప్రభుత్వం వేలంలో ప్రకటించింది. సత్తుపల్లి, శ్రవణ్ పల్లి, కళ్యాణి ఖని -6 బొగ్గుబ్లాకులకు ఎవరూ ఆసక్తి లేదు. కోయగూడెం బ్లాకుకు సాంకేతిక ఆమోదం లభించడంతో మిగతా ప్రైస్ బిడ్ కూడా ఆమోదం అవుతుందని పలువురు చెబుతుననారు. సింగరేణికి దీనిపై ఆశలు సన్నగిల్లాయి.
మూడు గనులపై ఆశలు సజీవం..
సింగరేణికి చెందిన మూడు బొగ్గు గనులపైనే ఆశలు సజీవంగా ఉన్నాయి. కోయగూడెం బ్లాక్‌కు అరో కంపెనీ బిడ్ వేయగా, మిగతా మూడు గనులకు మాత్రం ఒక్క బిడ్డర్ కూడా ఆసక్తి చూపలేదు. దీంతో మిగతా సత్తుపల్లి బ్లాక్, శ్రావణ్‌పల్లి, కళ్యాణిఖని బ్లాక్‌లకు ఇప్పుడైతే ప్రమాదం ఏమీ లేదు. మరి ఈ విషయంలో కార్మిక సంఘాలు ఏం చేస్తాయనే విషయంలో ఆసక్తి నెలకొంది. మరోవైపు సింగరేణి సంస్థ నాలుగు బొగ్గు బ్లాకుల్లో బొగ్గు అన్వేషణ చేపట్టేందుకు వెచ్చించిన రూ.6 కోట్లు వృథా కానున్నాయి. సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణ్ పల్లి బ్లాకు-3లతో పాటు కళ్యాణిఖని-6 గనుల్లో బొగ్గు అన్వే షణ చేపట్టేందుకు సింగరేణి సంస్థ రూ.66 కోట్లు వెచ్చించింది. ఊహించని విధంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వీటికి వేలం ప్రకటన చేయడంతో సింగరేణిలో ఆందోళన నెలకొంది. కొత్త నిబంధనల ప్రకారం బొగ్గు బ్లాకులపై కేంద్రానికే హక్కు ఉండటంతో నిర్ణయాధికారం వారి చేతుల్లోనే ఉంది.