కొత్త ఫీచర్‌తో అదరగొట్టబోతోంది

కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో ముందుకు వ‌స్తున్న వాట్స‌ప్ మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఇటీవల మొబైల్ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్‌టాప్ యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఒక ప్రధాన అప్‌డేట్‌లో, వినియోగదారులు వారి వాట్సాప్‌ ప్రొఫైల్‌ల కోసం కవర్ ఫోటోలను సెట్ చేయడానికి అనుమతించే కొత్త ఫీచర్‌పై వాట్సాప్‌ పని చేయడం ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగదారులు వారి ప్రొఫైల్ ఫోటోలను మాత్రమే పెట్టుకోవచ్చు. కానీ ఫేస్‌బుక్‌లో పెట్టుకునే కవర్‌ ఫోటో మాదిరిగా వాట్సాప్‌లో అలాంటి ఫీచర్‌ లేదు. ఇలాంటి ఫీచర్‌ను వాట్సాప్‌లో కూడా తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వాట్సాప్‌ వెల్లడించింది.

అయితే ఈ ఫీచర్ వాట్సాప్ బిజినెస్ యాప్ వినియోగదారులకు మాత్రమే పరిమితం చేస్తారు. వ్యాపార కార్యకలాపాల కోసం కవర్ ఫోటోను సెట్ చేసే సామర్థ్యం, ​భవిష్యత్ అప్‌డేట్‌లో అందుబాటులో ఉంటుంది అని పేర్కొంది. ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. బిజినెస్‌ సెట్టింగ్‌ల కింద వినియోగదారులు అదనపు కెమెరా బటన్‌ను ఆప్షన్‌ను పొందుతారు. కొత్త కెమెరా బటన్‌ను ఉపయోగించి, వినియోగదారులు తమ ప్రొఫైల్‌లకు కవర్ ఫోటోలను సెట్‌ చేసుకోవచ్చు అని వెల్లడించింది.

You might also like