పేదలను దోచుకుంటున్నారు
-డెవలప్‌మెంట్ చార్జీలపై ఆందోళన చేస్తాం
-టీపీసీసీ సెక్రటరీ మత్తమారి సూరిబాబు
మంచిర్యాల : తఎలంగ తెలంగాణ ప్రభుత్వం పేదలపై భారం మోపుతోందని, వారిని దోచుకుంటోందని టీపీసీసీ సెక్రటరీ మత్తమారి సూరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బిల్లులపై డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అధిక చార్జీలకు నిరసనగా ఈ నెల 22 న విద్యుత్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యనైనా అడ్డుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అమ్రాజుల శ్రీదేవి, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాంయాదవ్, మాజీ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, సిలివేరు సత్యనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా సెక్రెటరీ మేకల శ్రీనివాస్, ఎస్సీ సెల్ టౌన్ సెక్రెటరీ రామగిరి శ్రీను, ఎస్సీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బర్రె మదునయ్య, దేవసాని ఆనంద్ జంజిరాల రాజం, టౌన్ వైస్ ప్రెసిడెంట్ లెంకల శ్రీనివాస్, ఎన్ ఎస్ యు ఐ వైస్ ప్రెసిడెంట్ సోదే వినేష్, యూత్ వైస్ ప్రెసిడెంట్ పోచంపల్లి హరీష్, కాంగ్రెస్ పార్టీ టౌన్ సెక్రెటరీ అంకం రవి, ఆడెపు మహేష్, సింగ్ ఆడే సాబ్, రాజా బ్రహ్మం, కుమ్మరి శంకర్, దేవసాని ఆనంద్, మెరుగు రామకృష్ణ , సోగల రవికుమార్, కాశిపాక రాజారత్నం, బబ్లు, నీర్ల రవి కుమార్,
కొయ్యడ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.