విజయవాడలో కేసిఆర్ ఫ్లెక్సీలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రాలో మరోసారి ఫ్లెక్సీలు వెలిశాయి. గతంలో రాజకీయ అభిమానులు కేసీఆర్‌పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, ఈసారి పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ వీటిని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ హ్యాట్సాఫ్ చెప్పారు.
సీఎం కేసిఆర్‌కు ఏపీలో కూడా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన అధికారం చేపట్టినప్పటి నుండి నేటి వరకు అనేక సార్లు ఆయన ఫ్లేక్సిలను ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే పలు రాజకీయ సంధర్భాలతో పాటు ఆయన బర్త్ డే సంధర్భంగా అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే సారి మాత్రం సినిమా అభిమానులు సీఎంకు ఫ్లెక్సీలు కట్టారు.. ముఖ్యంగా సీఎం కేసిఆర్‌ను పలు సందర్భాల్లో వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈ ఫ్లెక్సీలను కట్టడడం గమనార్హం.
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లానాయక్ సినిమా రిలీజ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సినిమా విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకోవడం తోపాటు ఐదో షోకు అనుమతులు ఇచ్చింది. దీంతో సీఎం కేసిఆర్‌తో పాటు మంత్రులు కేటిఆర్, సినిమటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌లతో పాటు విజయవాడకు చెందిన వంగవీటి రంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకృష్ణ తోపాటు జనసేన పార్టీ నాయకుడు నాదేండ్ల మనోహర్ ఫోటోలను ఫ్లెక్సీలో పెట్టారు.
కాగా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా తెలంగాణ మంత్రి కేటిఆర్‌తో పాటు తలసాని శ్రీనివాస యాదవ్‌లు హజరయ్యారు. ఈ సంధర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాన్ కేటిఆర్‌తో పాటు సీఎం కేసిఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత కూడా ఆయన ఓ లేఖను కూడా విడుదల చేశారు. మరోవైపు ఏపీలో బీమ్లానాయక్ సినిమా విడుదలపై పలు ఏపీ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే..
సీఎం కేసిఆర్ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోని రావులు పాలెంలో కోనసీమ ముఖ ద్వారం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో కేటీఆర్ నవ్వులు చిందిస్తున్న ఫోటో పెట్టి.. తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి శుభాకాంక్షలు.. ఆడు మగాడ్రా బుజ్జి అంటూ ముద్రించారు.