సెలూన్ షాపులో తెలంగాణ పథకాలు
వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్న నాయీబ్రాహ్మణుడు
పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకా లను నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ నాయి వినూత్నరీతిలో ప్రచారం చేస్తున్నారు.
నాగోల్ డివిజన్ బండ్లగూడ, ఆనంద్‌నగర్ చౌరస్తాలో బాలకృష్ణ వెస్టన్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ షాపును నిర్వహిస్తున్నారు. కులవృత్తులు, ఇతర సామాజిక వర్గాలు, పేదలు, రైతుల కోసం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను ఈయనను అమితంగా ఆకర్షించాయి. దీంతో తన సెలూన్లో పథకాలతో కూడిన భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, కేసీఆర్ పాలనపై ప్రచారం నిర్వహిస్తున్నారు. సెలూన్‌కు వచ్చేవారిని ఈ పథకాల ఫ్లెక్సీ ఆకట్టకొంటున్నది.