అటవీ శాఖ సిబ్బందిపై దాడి
-బీట్ అధికారి శిరీష చేతికి గాయం
-ఆమె ఎనిమిది నెలల గర్భిణి
కొమురం భీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాగజ్ నగర్ మండలం ఊట్ పల్లిలో అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తుల దాడికి తెగబడ్డారు. దీంతో అటవీ శాఖ సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో బీట్ అధికారి శిరీష ఎనిమిది నెలల గర్భిణి కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అటవీ సంరక్షణ పై సిబ్బంది కళజాత బృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఈ కళాజాత ప్రదర్శనను గ్రామస్తులు అడ్డుకున్నారు. అటవీశాఖ సిబ్బందిని గ్రామం నుంచి వెళ్లగొట్టారు. వెనక్కి తిరిగి వస్తున్న బిట్ ఆఫీసర్ శిరీష, వాచర్ దేవ్ సింగ్, శంకర్, రాములను గ్రామస్తులు అడ్డుకున్నారు. శిరీష పై కూడా దాడి చేయడంతో ఆమె చేతికి గాయం అయ్యింది. ఎనిమిది నెలల గర్భంతో ఉన్న శిరీష తీవ్ర అస్వస్థత గురి కాగా, ఆమెను కాగజ్ నగర్ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.