కార్మికుల కోసం పోటాపోటీగా

- నీకంటే నేను ఎక్కువ ఇస్తా అంటున్న జాతీయ బ్యాంకులు
- రూ. 40 ల‌క్ష‌ల బీమా ఇస్తామంటున్న ఎస్‌బీఐ
- రూ. 62 ల‌క్ష‌లు ఇస్తామ‌ని చెబుతున్న యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- అద‌న‌పు బీమా, మ‌రిన్ని సౌక‌ర్యాలు ప్ర‌క‌టించిన బ్యాంకులు
- నేటి నుంచి ఎస్‌బీఐ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

మంచిర్యాల : సింగ‌రేణి కార్మికుల‌ను ఆక‌ర్షించేందుకు జాతీయ బ్యాంకులు పోటీ ప‌డుతున్నాయి. తాము బీమా ఎక్కువ చెల్లిస్తామ‌ని, కార్మికుల‌కు రాయితీలు క‌ల్పిస్తామ‌ని హామీ ఇస్తున్నాయి. దీంతో కార్మికులు ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు.

సింగ‌రేణి కార్మికుల‌కు బ్యాంకులు బంప‌ర్ ఆఫ‌ర్‌లు ప్ర‌క‌టిస్తున్నాయి. వారిని ఆక‌ర్షించేందుకు రాయితీలు అందిస్తున్నాయి. దీంతో కార్మికులు ఏం చేయాల‌ని ఆలోచిస్తున్నారు. యాజ‌మాన్యం జ‌రిపిన చ‌ర్చ‌ల ఫ‌లితంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్మికుల‌కు రూ. 40 లక్షల ప్రమాద బీమా చెల్లించడానికి ముందుకు వ‌చ్చింది. దీంతో తాము రూ. 62 ల‌క్ష‌లు బీమా కింద చెల్లిస్తామ‌ని యూనియన్ బ్యాంకు కార్మికుల‌కు ఆఫర్ ఇచ్చింది. అంతేకాకుండా అదనపు ప్యాకేజీతో ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ప్ర‌మాద బీమా రూ. 40 ల‌క్ష‌లు, రాయితీలు..
సింగరేణి ఉద్యోగుల పొదుపు ఖాతాల్లో యాజమాన్యం వేతనాలు, ఇతర ప్రయోజనాలను జమ చేస్తోంది. పొదుపు ఖాతాల స్థానంలో కార్పొరేట్ వేతన ఖాతాలుగా మార్చుకుంటే వ్యక్తిగత ప్రమాద బీమా రూ.40 లక్షలు చెల్లించడానికి ఎస్బీఐ ముందుకు వచ్చింది. శాశ్వత వైకల్యం పొందినా, మరణించినా ఈ బీమా వర్తిస్తుందని పేర్కొంది. పాక్షిక శాశ్వత వైకల్యం పొందితే రూ. 20 లక్షలు చెల్లించనున్నట్లు ప్రకటించింది.

ఇవ్వాళ్టి నుంచే ఎస్‌బీఐలో దరఖాస్తుల స్వీకరణ
ఎస్‌బీఐ సింగ రేణి ఉద్యోగుల పొదుపు ఖాతాలను మార్చి 4 నుంచి కార్పొరేట్ వేతన ఖాతాలుగా మార్చుకునేం దుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రమాద బీమా సదుపాయం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని, ఇది మూడేళ్ల పాటు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. దీనివల్ల ఉద్యోగుల ఖాతాల్లో కనీస నిల్వ సొమ్ము అవసరం. ఏటీఎంలో లఅపరిమిత సంఖ్యలో సొమ్మును తీసుకునే వెసులుబాటు ఉంటుంది. నికర వేతనం ఆధారంగా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందే వెసులుబాటు ఉంటుంది. డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లకు భద్రత ఉంటుందని ప్ర‌క‌టించింది.

ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్యాకేజీతో యూనియ‌న్ బ్యాంక్‌..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ఆకర్షణీయమైన ప్యాకేజీతో ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కార్పొరేట్ వేతన ఖాతా ఉన్న ఉద్యోగు లకు రూ. 32 లక్షల ప్రమాద బీమా కల్పించడం తోపాటు, ఏటా రూ. 306.03 టాప్ అప్ బీమా చెల్లించిన వారికి అదనంగా రూ.30 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు సింగరేణి యాజమాన్యానికి లేఖ రాసింది. రెండూ కలిపితే ప్రమాద బీమా రూ. 62 లక్షలు అవుతుంది. రూ. 25 లక్షల లోపు వ్యక్తిగత రుణాలపై సిబిల్ స్కోర్ ఆధారంగా 8.9 శాతం నుంచి 9.5 శాతం మధ్య వడ్డీ రేటు మాత్రమే వర్తింపజే యనున్నట్లు తెలిపింది. నామమాత్రపు ప్రీమి యంతో రూ. పది లక్షల గృహ, వ్యక్తిగత రుణాలపై బీమా అమలౌతుందని పేర్కొంది. ఎలాంటి చెల్లింపులు లేకుండా రూపే క్రెడిట్ కార్డు అదనంగా రూ. పది లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని వివరించింది.

ఇలా రెండు బ్యాంకులు పోటాపోటీగా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంతో కార్మికులు ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు. ఎందులోకి మారాలి అనే విష‌యంపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఏది ఏమైనా ఈ రెండు బ్యాంకుల మ‌ధ్య పోటీ కార్మికుల‌కు మేలు చేకూరుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like