దొంగ దీక్షలు చేస్తున్న టీబీజీకేఎస్
హెచ్ఎంస్ ఉపాధ్యక్షుడు పతెం రాజబాబు
మంచిర్యాల : గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలకు వారి గుర్తింపు రద్దు చేయగానే కార్మికుల సమస్యలు గుర్తుకు వస్తున్నాయని హెచ్ఎంస్ ఉపాధ్యక్షుడు పతెం రాజబాబు విమర్శించారు. గోలేటి సీహెచ్‌పీ లో కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఇంజనీర్ రాజుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ నిన్నటి దాకా పైరవీలు, సంపాదనకు ప్రాధాన్యతనిచ్చిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ నాయకులు ఇప్పుడు కార్మిక సమస్యలు పరిష్కరించాలని దొంగ పోరాటాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్మిక సమస్యలు పరిష్కరించకుండా యాజమాన్యంతో కుమ్మక్కై ఉచిత మస్టర్లకు ఆశపడి కార్మికులకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీహెచ్‌పీలో యాక్టింగ్ చేస్తున్న కార్మికులకు పదోన్నతి కల్పించాలన్నారు. సీహెచ్‌పీలో పదవి విరమణ చేసిన కార్మికుల స్థానంలో ఇతరులను నియమించకపోవడం వల్ల కార్మికుల సంఖ్య తగ్గిందన్నారు. సీహెచ్‌పీకి సరిపడా కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. కార్మికులందరి కి ప్లేడే లు కల్పించాలని కోరారు. ఇక్కడ ఎలక్ట్రికల్ సూపర్ వైజర్లు లేరని వారిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌పీ పిట్ సెక్రటరీ ఎండీ అరీఫ్, ఏరియా సెక్రటరీలు మరిశెట్టి దత్తు, ఎస్‌కే ఇనూస్, మంతెనవేణుగోపాల్, ఎస్అండ్‌పీసీ పిట్ సెక్రెటరీ ఎం. శ్రీనివాస్, షిప్ట్ ఇన్‌చార్జీలు ఉమామహేశ్వర్ , రవీందర్ పాల్గొన్నారు.