సింగరేణి పదవీ విరమణ కార్మికుల గెట్ టు గెదర్

మంచిర్యాల : కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు గెట్ టు గెదర్ చేసుకోవడం చూస్తుంటాం.. ఎన్నో ఏండ్ల కిందట ఓకే పాఠశాల, కళాశాలలో చదువుకున్న వారంతా చేరి ఆడిపాడి సరదగా గడుపుతారు. కానీ తామెందుకు కలవొద్దనే ఆలోచన సింగరేణి రిటైర్డ్మెంట్ కార్మికులకు వచ్చింది. అనుకున్నదే తడవుగా ఫోన్లలో మాట్లాడుకున్నారు. ఆదివారం అంతా ఒక్కటయ్యారు. బెల్లంపల్లి ఏరియా ఏంవీకే 1లో పనిచేసి పదవీ విరమణ చెందిన కార్మికులు అందరూ బోయపల్లి బోర్డు వద్ద ఉన్న మామిడి చెట్లలో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. కార్యక్రమం కోసం దూర ప్రాంతాల నుంచి సైతం రిటైర్డ్ కార్మికులు ఇక్కడకు రావడం గమనార్హం. ఇక్కడకు వచ్చి ఇలా కలవడం ఎంతో సంతోషంగా ఉందని రిటైర్డ్ కార్మికులు నాందిన్యూస్కు చెప్పారు.