ఆరుగురు సింగరేణి కార్మికులు గల్లంతు..
పెద్దపల్లి జిల్లా సింగరేణి రామగుండం ఏరియా _3 అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు బొగ్గు గనిలో పైకప్పు కూలంతో ఆరుగురు కార్మికులు బొగ్గు పొరల కింద చిక్కుకున్నారు. ఈ రోజు ఉదయం షిప్టులో 8 వ సీం 86 లెవల్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు
.తేజ (అసిస్టెంట్ మేనేజర్),జాది వెంకటేశ్వర్లు (ఆపరేటర్),రవీందర్ (బదిలీ వర్కర్),పిల్లి నరేష్ ( మైనింగ్ సర్దార్),మీస వీరయ్య (సపోర్ట్ మెన్) గా అదికారులు గుర్తించారు.వీరిని కాపాడేందుకు సింగరేణి మైన్స్ రెస్కూ సిబ్బంది రంగంలోకి దిగారు.ప్రమాదంలో గాయపడ్డ మరో కార్మికుడిని గోదావరిఖనిలోని సింగరేణి ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.