ఆ ప్రమాదంలో సెఫ్టీ ఆఫీసర్ కూడా…

అడ్రియాల లాంగ్వాల్లో జరిగిన ప్రమాదంలో ఏరియా సెఫ్టీ అధికారి కూడా ఉన్నారు. ఏరియా సేఫ్టీ అధికారి జేరాజ్ అక్కడికి వెళ్లిన క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆయన ఆచూకీపై ఇప్పటి వరకు ఎవరూ ప్రకటన చేయలేదు. దీంతో ఆయన పరిస్థితి ఏమిటనేది..? తెలియడం లేదు. కాగా, ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఎస్డీఎల్ ఆపరేటర్ వెంకటేష్ ను రెస్య్కూ టీం కాపాడింది… షాట్ఫైరర్ నరేష్ బొగ్గు పెళ్లల కింద ఇరుక్కుని ఉన్నారు. ఆయన రెస్క్యూ టీంతో మాట్లాడున్నారు. అతనికి ఆక్సిజన్ అందిస్తూ అతన్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా వారి పరిస్థితి ఏమిటనే విషయం తెలియరాలేదు.