మృత్యుంజయుడు
-ప్రాణాలతో బయటకు వచ్చిన మరో కార్మికుడు
-బదిలీ వర్కర్ రవీందర్‌ను కాపాడిన రెస్క్యూ సిబ్బంది
-మరో ముగ్గురు శిథిలాల కిందే
అడ్రియాలా లాంగ్ వాల్ గనిలో జరిగిన ప్రమాదంలో బదిలీ వర్కర్ రవీందర్‌ను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ప్రమాదంలో బొగ్గు పెళ్ళల్లో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ సిబ్బంది ధైర్యసాహసాలతో ఒక్కొక్కరిని బయటికి తీస్తున్నారు. దాదాపు 24 గంటలు గడిచిన తర్వాత అతన్ని కాపాడగలిగారు. సోమవారం రామగుండం రీజియన్ లోని ఏఎల్‌పీలో 86వ లెవల్ వద్ద కార్మికులు రూఫ్ బోల్టింగ్ చేస్తుండగా, 20 మీటర్ల సైడ్ వాల్ కూలింది. దీంతో ఏడుగురు కార్మికులు చిక్కుకుపోయారు. అందులో ముగ్గురు కార్మికులను నిన్ననే రక్షించారు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం బదిలీ వర్కర్ రవీందర్ ను కాపాడారు. ఆర్జీ 2 ఏరియాలోని జీడీకే 7 ఎల్ఈపీ గనిలో పనిచేస్తున్న బదిలీ వర్కర్ వీరవేన రవీందర్ ఇటీవలే అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టుకు బదిలీపై వచ్చారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఎట్టకేలకు రెస్క్యూ సిబ్బంది అతన్ని కాపాడారు.