మీరెందుకు రారు…?
ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు
అడ్రియాలలో జరిగిన గని ప్రమాదానికి సంబంధించి సింగరేణి సీఅండ్ఎండీ, పెద్దలు రాకపోవడం బాధారకరమని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల సింగరేణికి లాభం లేదన్నారు. ఇరవై రోజుల కిందట బ్యాక్ ప్యాచ్ ఉందని కార్మికులు చెప్పినా కూడా సింగరేణి యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. కొంత కాలంగా సింగరేణిలో ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం కనీసం పట్టించుకోకపోవడం బాధకరమన్నారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా కూడా సింగరేణి యాజమాన్యం బాధిత కుటుంబాల దగ్గరికి రాకపోవడం ఏమిటని మండిపడ్డారు.