అంగన్వాడీ టీచర్‌కు షోకాజ్ నోటీస్
మంచిర్యాల : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్‌కు జిల్లా సంక్షేమాధికారి మాస ఉమాదేవి షోకాజ్ నోటీస్ అందించారు. కాసిపేట మండలంలోని అంగన్వాడీ సెంటర్‌ను కలెక్టర్ భారతి హోళీకేరీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ టీచర్ విధుల్లో లేకపోవడం గుర్తించారు. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా సంక్షేమాధికారి ఉమాదేవి అంగన్వాడీ టీచర్‌కు షోకాజ్ అందించారు. దానికి సరైన సమాధానం రాకపోతే ఆమెను పూర్తిగా విధుల్లో నుంచి తొలగించే అవకాశం ఉంది.