చార్మినార్ పై కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీ..కేసు నమోదు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె ఫ్లెక్సీ చార్మినార్ పై ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది.చారిత్రక కట్టడం పై ప్లెక్సీలు ఆవిష్కరించడం నిబంధనలకు విరుద్ధమని చార్మినార్ కన్జర్వేటర్ రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై కేసు బుక్ చేశారు. ఫ్లెక్సీ కట్టిన టిఆర్ఎస్ నేతలు పుప్పాల రాధాకృష్ణ, విజయ్ కుమార్ తో పాటు మరో నాయకుడు పోలీసులు కేసు నమోదు చేశారు.