జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పులు..

జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 16 నుంచి 21 మధ్య జేఈఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే.. వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ ఆయా తేదీల్లో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ మేరకు స్పందించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల తేదీలను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1 4 తేదీల్లో జేఈఈ మెదటి సెషన్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.