రెండు రోజుల్లో టెట్ పరీక్ష
రెండు మూడు రోజుల్లోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. గతంలో మాదిరిగానే ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష జరుపుతామని స్పష్టం చేశారు. రానున్న భారీ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో.. ఉపాధ్యాయుల నియామకాలు డీఎస్సీ ద్వారా జరగనున్నాయా? లేక టీఎస్పీఎస్సీ చేపడుతుందా అన్న విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. మరోపక్క టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే ఆ స్కోర్‌కు ఏడేళ్లకు బదులు జీవితాంతం విలువ ఉంచాలని, బీఈడీ అభ్యర్థులకు పేపర్-1 రాసే అవకాశం ఇచ్చేలా జీవో ఇవ్వాలంటూ అధికారులు ప్రతిపాదించారు. వాటిని ప్రభుత్వం ఆమోదించలేదు.