ఆ విద్యార్థులకు కేసీఆర్ గుడ్‌న్యూస్..

ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తూ యుద్ధం కారణంగా మధ్యలోనే తిరిగి వచ్చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముగింపు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి ఉక్రెయిన్ వెళ్లి చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థులకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థుల చదువులకు కావాల్సిన ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని, దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం నిర్ణయంతో శాసన సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సెర్ఫ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందజేస్తున్నామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. దీనితో పాటు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధులలోకి తీసుకుంటామని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.