టీబీజీకేఎస్ హయాంలోనే హక్కుల సాధన
-కోల్ ఇండియాలో లేనివి కూడా ఇక్కడ అమలు
-ముఖ్యమంత్రి సహకారంతో కార్మికుల సంక్షేమం
-చేసినవి కార్మికులకు చెప్పి ఎన్నికలకు వెళ్దాం
-బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాస్‌రావు
మంచిర్యాల : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హయాంలోనే సింగరేణి కార్మికులకు సంబంధించి ఎన్నో హక్కులు సాధించుకున్నామని బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. బుధవారం బెల్లంపల్లి ఏరియా మాదారం టౌన్షిప్లో టీబీజీకేఎస్ ఏరియా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సింగరేణి అంటే ప్రత్యేకమైన ప్రేమ అన్నారు. అందుకే కోల్ ఇండియాలో సైతం లేని ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మరే ప్రభుత్వ సంస్థలో లేని విధంగా కారుణ్య నియామకాలు, తెలంగాణ ఇంక్రిమెంట్, సకల జనుల సమ్మె కాలపు వేతనాలు ఇలా ఎన్నో పొందినట్లు స్పష్టం చేశారు.
తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం,మహిళకు ఉద్యోగాలు,పెళ్లి అయిన కూతుళ్లకు సైతం ఉద్యోగాలు, కార్మికుల క్వార్టర్లకు ఉచిత విద్యుత్ ఇలా ఎన్నో సౌకర్యాలు అందించిన ఘనత తమదేనని వెల్లడించారు. మా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,అధ్యక్షుడు వెంకట్రావ్,ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య సహకారంతో పరిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. వివిధ కారణాల వల్ల ఉద్యోగం సాధించే డిపెండెంట్ల వయో పరిమితి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో కార్పొరేట్ చర్చల ప్రతినిధి ధరావత్ మంగీలాల్,చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగం ప్రకాశరావు,పిట్ కార్యదర్శులు కాగితం వెంకటేష్,అన్నం లసుమయ్య,ఎస్.రాజేశం,మేరుగురమేష్,గురిజాల రమేష్,వీరన్న,గుజ్జ శ్రీనివాస్,జీ.రవీందర్, అనుముల సత్యనారాయణ, ఓరం కిరణ్, ఏరియా కార్యదర్శి సంపత్‌రావు,జీఎం కమిటీ సభ్యులు కోగిలాల రవీందర్, వెంకటేశ్వర్లు, మాంతు సమ్మయ్య, గజెల్లి చంద్రశేఖర్,అసిస్టెంట్ ఏరియా కార్యదర్శులు మందనపు రామారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం. కుమారస్వామి, ఆఫీస్ ఇన్చార్జి వంగ మహేందర్, ఏరియా కమిటీ నాయకులు చంద్రకుమార్,మాసాడి నారాయణ,అలవేణి సంపత్, భాస్కరాచారి, సోకాల శ్రీనివాస్, ఎంపీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.