రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా వికాస్‌రాజ్
దిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్‌ను నియమిస్తూ భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శిగా వికాస్ రాజ్ ఉన్నారు. కాగా, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న శశాంక్ గోయల్ ఇటీవల బదిలీ అయిన సంగతి తెలిసిందే.