ఆర్మీలో ఆఫీసర్ పోస్టులు..
బీటెక్ చేసినవారికి ఇప్పుడు ఫైనల్ ఇయర్‌లో ఉన్నవారికి ఈ వార్త శుభవార్తే అని చెప్పాలి.. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం వచ్చింది. ఏకంగా భారత రక్షణ శాఖలో ఆఫీసర్ పోస్టులో చేరిపోవచ్చు. ఇండియన్ ఆర్మీ ఖాళీగా ఉన్న పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్ (joinindianarmy.nic.in) లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అర్హులైన అవివాహిత పురుష, మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి షార్ట్ సర్వీస్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. మరణించిన రక్షణ సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించింది. తమిళనాడులోని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అక్టోబర్ 2022లో కోర్సు ప్రారంభమవుతుందని ప్రకటించారు.
SSC(టెక్నికల్) కోసం – 175
SSCW(టెక్నికల్) కోసం – 14
విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ – 02
SSC(W) టెక్ – 01
SSC(W) (నాన్ టెక్) (UPSC కానిది) – 01)
ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయో పరిమితి SSC (టెక్), SSCW(టెక్) పోస్టులకి అక్టోబర్ 1, 2022 నాటికి 20 నుంచి 27 సంవత్సరాలు. అంటే (అభ్యర్థులు 02 అక్టోబర్ 1995, 01అక్టోబర్ 2002 మధ్య జన్మించినవారు అర్హులు.) మరణించిన రక్షణ సిబ్బంది కుటుంబ సభ్యులు: అక్టోబర్ 1, 2022 నాటికి గరిష్టంగా 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. అభ్యర్థులు ఏప్రిల్ 6 సాయంత్రం 3 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.