ఖరీదైన కార్లు పక్కకు… థార్ ఎక్కిన మోదీ..
ప్రధాని మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. ఆయన పలు రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ నిర్వహించిన రోడ్ షోలలో తన ఖరీదైన మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్‌లను పక్కన పెట్టి మరీ… మహింద్రా థార్‌లోనే ప్రయాణించారు. మహింద్రా థార్ భారత్‌లోనే తయారైన వెహికిల్. ఈ వెహికిల్‌పైనే సుదీర్ఘ సమయం పాటు రోడ్ షో నిర్వహించారు మోదీ.
మోదీ తన రోడ్ షోలో మహింద్రా థార్‌ను వాడటంతో.. మహింద్రా అండ్ మహింద్రా చీఫ్ ఆనంద్ మహింద్రా ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆనంద్ మహింద్రా తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో ఒక ట్వీట్ చేశారు ‘థ్యాంక్యూ పీఎం @narendramodiji, గెలుపు పరేడ్‌ను నిర్వహించేందుకు మేడిన్ ఇండియా వెహికిల్ కంటే మెరుగైనది ఏదీ లేదు’ అని ట్వీట్ చేశారు. రోడ్ షోలో మోదీ మహింద్రా ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ థార్‌లో ప్రయాణించారు. ఇది ఓపెన్ మోడల్ థార్. ఈ మహింద్రా థార్ వెనుకాలే మిగిలిన ఖరీదైన కార్లన్ని ప్రయాణించాయి.