సింగరేణి పరిరక్షణ రణభేరి విజయవంతం చేద్దాం
సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర విజయవంతం చేద్దామని ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి కోరారు. గురువారం ఆర్జీ-3 వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర కైరిగుడ నుండి కొత్త గూడెం వరకు జరుగుతుందని తెలిపారు. 21 నుండి 31 వరకు జరిగే ఈ యాత్ర 26వ తేదీన ఆర్జీ-3 లో కొనసాగుతుందన్నారు. దీనిని విజయవంతం చేయడానికి కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఆర్జీ-3 ఏరియా ఉపాధ్యక్షుడు కోట రవీందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఐఎన్ టీయూసీ బ్రాంచి కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్, సెంట్రల్ నాయకులు ఎన్ శ్రీనివాస రావు, అసిస్టెంట్ బ్రాంచి కార్యదర్శి పివి గౌడ్, బ్రాంచి కోశాధికారి మంగయ్య, సీనియర్ నాయకులు సత్యనారాయణ, పిట్ కార్యదర్శులు వెంకట్ స్వామి, ఆర్ మనోహర్, టి నారాయణ, కిషన్ నాయక్, ఉయ్యాల కుమార్, యాకూబ్, శ్రీనివాస చారి, బత్తుల శంకర్, రవి,టి శ్రీనివాస్,నెల్సన్ పాటిల్, కాశీం, రాజకుమార్, చుక్కయ్య, చంద్రయ్య, సందెల కుమార్, టి మొగిలి, సుధీర్ పాల్గొన్నారు