మందు.. చిందు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అత్యుత్సాహం..

మహబూబాబాద్ జిల్లాలో హోళీ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన క్యాంపు కార్యాలయంలో హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తలపై రంగులు జల్లుతూ సందడి చేసిన ఆయన కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. బీరు బాటిళ్లు చేత్తో పట్టుకున్న డ్యాన్స్ చేయడంతో పాటు మద్యాన్ని స్వయంగా కార్యకర్తల నోట్లో పోస్తూ హంగామా సృష్టించారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఉత్సాహంగా ఆయన అనుచరులు మరింత రెచ్చిపోయారు. హోళీ వేడుకల్లో ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు మద్యంతో హల్చల్ చేయడం స్థానికులను షాక్‌కు గురిచేసింది