దైవ దర్శనానికి వెళ్లిన వ్యక్తులపై తేనెటీగల దాడి.. ఒకరి మృతి
మంచిర్యాల : దేవుడి దర్శనానికి వెళ్లిన వ్యక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలు అయ్యాయి. లక్సెట్టిపేట మండలం చిన్నయ్య దేవుని దర్శనానికి వెళ్లిన పలువురు పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో దండేపల్లి కి చెందిన కట్ట వేణు మృతి చెందాడు. మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వారికి చికిత్స అందిస్తున్నారు.