జూన్ 12న టెట్ పరీక్ష

టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే ఒక్కొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. బుధవారం 30 వేల ఉద్యోగాలకు ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీచర్ ఉద్యోగానికి అర్హతగా భావించే టెట్ కు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టనుంది. ఏప్రిల్ 12ను దరఖాస్తుకు చివరి తేదీగా గడువు విధించారు. అనంతరం జూన్ 12న పరీక్ష నిర్వహించనున్నారు.