జాతీయ సంఘాల ఆరోపణలు అవాస్తవం
టీబీజీకేఎస్ అధ్వర్యంలో కే.కే.5 గని పై గేట్ మీటింగ్
రెండు రోజుల సమ్మె విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ కోరారు. టీబీజీకేఎస్ అధ్వర్యంలో శుక్రవారం కే.కే.5 గని పై గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు బ్లాక్ లను వేలం వేయడం సరికాదన్నారు. 28,29 రోజులలో నిర్వహించే సమ్మె విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులను కోరారు. జాతీయ సంఘాలు చేసున్న అసత్య ప్రచారాలు ఆయన తీవ్రంగా ఖండించారు.., కార్మిక సోదరులను మభ్యపెట్టే పనులు చేసే భవిషత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు జె. రవీందర్, రీజనల్ సెక్రెటరీ ఓ రాజశేఖర్, జీఎం కమిటీ మెంబర్ శంకర్ రావు, పిట్ సెక్రెటరీ జీడి బాపు, CHP పిట్ సెక్రెటరీ జే. శ్రీనివాస్, సారయ్య, రాంచందర్, మోహన్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి,Y పవన్,బోడ్డు మల్లేష్, పెండెo క్రిష్ణ సాయి,సిద్ది సంపత్, కొప్పు లక్ష్మణ్, జరుపుల ప్రెమ్ లాల్, రవితేజ, భూమన్న,రమేష్ఉ ద్యోగులు పాల్గొన్నారు.