నా చావుకు పోలీసులే కార‌ణం

-తాండూరు సీఐ జ‌గ‌దీష్‌, ఎస్ఐ కిర‌ణ్‌కుమార్ యువ‌కుడి ఆరోప‌ణ‌లు
-హ‌త్య కేసులో ఇరికించాల‌ని చూస్తున్నారని ఆవేద‌న‌
-సెల్పీ వీడియో తీసుకుని మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

మంచిర్యాల : త‌న‌ను పోలీసులు హ‌త్య కేసులో ఇరికించాల‌ని చూస్తున్నార‌ని తాండూరు మండ‌లం కాసిపేట గ్రామానికి చెందిన ఓ యువ‌కుడు సెల్ఫీ వీడియో తీసుకుని మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు.. వివ‌రాల్లోకి వెళితే… గ‌త నెల‌లో రుకుం మ‌హేష్ అనే యువ‌కుడు రైలు ప‌ట్టాల‌పై శ‌వ‌మై క‌నిపించాడు. అది అనుమాన‌స్ప‌ద మృతిగా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విష‌యంలో త‌మ‌పై హ‌త్య కేసు న‌మోదు చేసేందుకు తాండూరు సీఐ జ‌గ‌దీష్‌, ఎస్ఐ కిర‌ణ్‌కుమార్ ప్లాన్ చేస్తున్నార‌ని ఆరోపించారు. కేవ‌లం ఒక ఫ‌న్నీ వీడియో ఆధారంగా త‌న‌పై కేసు న‌మోదు చేయాల‌ని చూస్తున్నారని ఆ వీడియో తెలిపాడు. సాగ‌ర్ కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న‌డు. మందు తాగిన అత‌న్ని బెల్లంప‌ల్లి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like