ఆ విజయం బీఎంఎస్ దే
బీఎంఎస్ జాతీయ కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యులు పీ.మాధవ నాయక్

సింగరేణి కార్మికులకు సంబంధించి సీఎంపీఎఫ్ నిధులు DHFL కంపెనీ నుంచి తిరిగి రికవరీ నిర్ణయం తీసుకోవడం భారతీయ మజ్దూర్ సంఘ్‌దేనని బీఎంఎస్ జాతీయ కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యులు పీ.మాధవ నాయక్ స్పష్టం చేశారు. కార్పొరేట్ మెయిన్ వర్క్ షాప్ లో \గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో 1300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని వెల్లడించారు. DHFL కంపెనీ దివాలా తీయడంతో ఆ కంపెనీ బాకీ ఉన్న 727 కోట్ల 56 లక్షల రూపాయలను CMPF ట్రస్టు బోర్డు మాఫీ చేసిందని స్పష్టం చేశారు. కార్మికులు, పెన్షనర్ల సొమ్మును ఈ రకంగా రద్దు చేయడం చట్ట విరుద్ధమని బీఎంఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేశామన్నారు. దీంతో కోల్ మినిస్ట్రీ అధికారులు దిగివచ్చారని తెలిపారు. అంతేకాకుండా CMPF కమిషనర్ దత్త మిగిలిన 727.56 కోట్ల రద్దు నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నట్లు లెటర్ ఇచ్చారని తెలిపారు. ఇది బీఎంఎస్ విజయమన్నారు. ఈ నెల 28,29న సార్వత్రిక సమ్మె చేయాలని కొన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని అది కేవలం వారి ఉనికి చాటుకోవడం కోసమేనన్నారు. కార్మికులు వారి మోసాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నామని వెల్లడించారు. అలాంటి సమ్మెకు తమ సంఘం మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు యం ప్రభాకర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేంద్ర బాబు, కార్పొరేట్ ఉపాధ్యక్షుడు జీవి.కృష్ణా రెడ్డి, కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు మొగిలిపాక రవి, కార్పొరేట్ కార్యదర్శి ఉట్ల గణేష్ రాంచందర్, కోశాధికారి, యాకుబుద్దిన్, కసార్ల మోహన్, గంధం సతీశ్, రాజమొగిలి, టీవీ.రావు, ఉమా మహేశ్వర రావు, ప్రవీణ్ పాల్గొన్నారు.