RRR కలెక్షన్ల సునామీ..
జక్కన్న సినిమా అంటే ఊహలకు అందదు.. అన్నట్టుగానే తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయలేదు జక్కన్న. సగటు సినీ ప్రేక్షకుడి ఊహను మించి వెండితెరపై RRR ఆవిష్కృతం చేశారు. దీంతో థియేటర్లో విజిల్స్ మోత మోగుతోంది. ఎన్నో వాయిదాల అనంతరం మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకుకొచ్చిన RRR సినిమా అనుకున్నట్లుగానే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు మంచి డిమాండ్ నెలకొంది. రాజమౌళి సినిమా, పైగా ఇద్దరు స్టార్ హీరోలు భాగం కావడంతో మొదటినుంచే RRRపై భారీ అంచనాలు నెలకొనగా.. విడుదల తర్వాత ఆ అంచనాలను మించిన రిజల్ట్ కనిపించింది. దీంతో థియేటర్లలో దూసుకుపోతున్న ఈ మూవీ పలు రికార్డులు తిరగరాస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే 223 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ RRR సినిమా. రెండో రోజు మరో సరికొత్త ఫీట్ అందుకుంది RRR సినిమా.కేవలం ఒక్క హైదరాబాద్ నగరంలోనే రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 9.90 కోట్ల గ్రాస్ రాబట్టి చరిత్రలో తన పేరును ముందువరుసలో పెట్టుకుంది RRR. గతంలో రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రాల జాబితాలో 4.60 కోట్లతో ‘పుష్ప’ సినిమా మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత 4.29 కోట్లతో రెండో స్థానంలో ‘భీమ్లా నాయక్’ ఉంది. ఇప్పుడు RRR ఆ రెండు సినిమాలకు అందనంత ఎత్తులో నిలిచి సరికొత్త రికార్డ్ నెలకొల్పడం విశేషం.
ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నిజాం పాలకుల పైన, అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ బ్రిటిష్ పాలకులపైన చేసే పోరాట సన్నివేశాల ఇరువురు హీరోల ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించాయని, ఇద్దరూ విప్లవ కణంలా కనిపించారని జనం చెప్పుకుంటున్నారు.