బ్రేకింగ్.. పారిపోయిన ఖైదీ ఆచూకీ లభ్యం
ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి పారిపోయిన ఖైదీ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమయ్యింది. జైనథ్ మండలము లో పట్టుకున్న జైలు సిబ్బంది. ఈ నెల 24న జిల్లా జైలు నుంచి పరారీ అయిన నాగోరావ్ అనే ఖైదీ. జైలు ఆవరణలో ఆవులు మేపుతూ ఖైదీ పారిపోయాడు. బాలికపై అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పారిపోవడంతో జైలు అధికారులు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్టకేలకు అతన్ని ఈ రోజు పట్టుకున్నారు.