కార్మిక లోకానికి ఉద్యమాభివందనాలు.

మంచిర్యాల : ప‌్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సింగరేణిలో నిర్వహిస్తున్న సమ్మె కార్మికులు పూర్తి స్థాయిలో విజయవంతం చేశారని వారికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున ఉద్యమాభివందనాలు చెబుతున్నట్లు టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాసరావు వెల్లడించారు. బెల్లంపల్లి ఏరియా గోలేటిలో సమ్మె సందర్భంగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల ఆకాంక్షను గమనించి సింగరేణికే బొగ్గు బ్లాకులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదివరకే సింగరేణి కార్మికులు ఫలుదపాలుగా సమ్మె చేయడం ద్వారా తమ డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వానికి వినిపించారన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు. అందుకే సింగరేణి కార్మిక వర్గం తిరిగి రెండు రోజుల సమ్మెకు పూనుకున్నదన్నారు .సమ్మెను విజయవంతం చేసిన కార్మికుల ఆకాంక్ష,ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించి సింగరేణికి బ్లాకులను కేటాయించాలన్నారు. సింగరేణికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణికి సంబంధించిన గనుల ఫారెస్ట్ క్లియరెన్స్లు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు వెంటనే పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు సమ్మయ్య, సంపత్ రావు,కోగిలాల రవీందర్,చంద్రకుమార్,రామారావు,కుమారస్వామి,మహేందర్, కారణాతంవెంకటేష్, అన్నంలక్ష్మయ్య, మెరుగు రమేష్,మాసాడినారాయణ,గుజ్జాశ్రీనివాస్,చంద్రయ్య,కాయితాస్వామి,కొండుశంకర్,వినయ్కుమార్, విద్యాసాగర్ చిరంజీవి, రాజేశం, సుగ్రీవులు, మర్రి సమ్మయ్య, శ్రీనివాస్, ఓరం కిరణ్, అశోక్, ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.