ఎంసెట్, ఈ-సెట్ నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ పరీక్షల నోటిఫికేషన్ కాసేపటి క్రితమే విడుదల అయింది. తెలంగాణ విద్యాశాఖ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం… ఏప్రిల్ 6 నుండి మే 28 వరకు ఆన్లైన్ దరఖాస్తులు జరుగనున్నాయి. అలాగే…. ఎంసెట్ పరీక్షల దరఖాస్తు.. జనరల్ అభ్యర్థులకు ఫీజు రూ.800 , ఎస్సీ, ఎస్టీలకు రూ.400 లను ఫిక్స్ చేసింది. జులై14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష నిర్వహించనున్నారు. జులై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ సెట్ పరీక్షల నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. జులై 13న ఎంట్రెన్స్ జరుగన్నట్లు స్పష్టం చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఏప్రిల్6 నుండి జూన్8 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ విద్యాశాఖ.