మంచిర్యాల బార్ అసోసియేషన్ నామినేషన్లు
మంచిర్యాల : మంచిర్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన సందడి కొనసాగుతోంది. దాదాపు అన్ని పోస్టులకు సంబంధించి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కాగా, జాయింట్ సెక్రటరీ పోస్టుకు మాత్రం రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆ ఒక్క పోస్టు మినహా మిగతావన్నీ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యింది. దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నామినేషన్లు వేసిన వారిలో అధ్యక్షుడిగా మాధవరపు రవీందర్ రావు, ఉపాధ్యక్షుడిగా భుజంగరావు, ప్రధాన కార్యదర్శిగా డేగ రవీందర్, జాయింట్ సెక్రటరీగా మురళీకృష్ణ, సత్యనారాయణ, కోశాధికారిగా గంగయ్య, మహిళా ప్రతినిధిగా మాధవి నామినేషన్ దాఖలు చేశారు. రేపటి వరకు విత్డ్రా కు అవకాశం ఉంది.